దళారులను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ సర్కార్
రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేయడంతోపాటు దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తున్నదని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. సోమవారం నకిరేకల్‌లోని మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించి, రైతులతో మాట్లాడారు. మార్కెట్‌కు ధాన్యం తీసుకువచ్చి నెల గడుస్తున్నా నేటికీ కొనుగోళ్లు చేపట్టడం లేదని రైతులు తమగోడు వెళ్లబోసుకున్నారు.
- ధాన్యం కొనకుండా కాలయాపన
- మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి ఫైర్
నకిరేకల్, నవంబర్ 16: రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేయడంతోపాటు దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తున్నదని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. సోమవారం నకిరేకల్‌లోని మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించి, రైతులతో మాట్లాడారు. మార్కెట్‌కు ధాన్యం తీసుకువచ్చి నెల గడుస్తున్నా నేటికీ కొనుగోళ్లు చేపట్టడం లేదని రైతులు తమగోడు వెళ్లబోసుకున్నారు. దీంతో ఆయన రైతులతో కలిసి మార్కెట్ యార్డులోనే కూర్చొని నిరసన తెలిపారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని నినాదాలు చేశారు. అనంతరం చిరుమర్తి డీఆర్డీవోతో ఫోన్లో మాట్లాడి రైతుల సమస్యలను వివరించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

