కాంగ్రెస్ సర్కార్ వల్లే రాష్ట్రంలో కరువు
కాంగ్రెస్ సర్కార్ వల్లే రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. మూడేండ్ల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం కన్నెపల్లిలో మోటర్లు ఆన్ చేయకుండా, నీళ్లు ఎత్తిపోయకపోవడంతో నేడు కరువు ఛాయలు అలుముకున్నాయని విమర్శించారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లిలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని పార్టీ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జి గుగులోత్ రామస్వామి నాయక్‌తో కలిసి గండ్ర ప్రారంభించారు.
- కాళేశ్వరాన్ని పండబెట్టి రైతులను ముంచిన రేవంత్
- భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర
జయశంకర్ భూపాలపల్లి, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కార్ వల్లే రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. మూడేండ్ల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం కన్నెపల్లిలో మోటర్లు ఆన్ చేయకుండా, నీళ్లు ఎత్తిపోయకపోవడంతో నేడు కరువు ఛాయలు అలుముకున్నాయని విమర్శించారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లిలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని పార్టీ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జి గుగులోత్ రామస్వామి నాయక్‌తో కలిసి గండ్ర ప్రారంభించారు.
అనంతరం అక్కడే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఓటర్ నమోదు ప్రక్రియపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపుతో రాష్ట్రంలో బీఆర్ఎస్ జైత్రయాత్ర మొదలవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాకేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. అబద్ధపు హామీలతో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేశాయని విమర్శించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

