కథలాపూర్ : కథలాపూర్ మండలం భూషణరావుపేట గ్రామానికి చెందిన మార్క్‌ఫెడ్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి లోక బాపురెడ్డి తల్లి నర్సవ్వ ఇటివలే మృతిచెందారు. కాగా లోక బాపురెడ్డిని మంగళవారం మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి పరామర్శించారు. నర్సవ్వ మృతికిగల కారణాలను అడిగి తెలుసుకుని లోక బాపురెడ్డిని, ఆయన కుటుంబసభ్యులను ఓదార్చారు.
నర్సవ్వ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారి వెంట కథలాపూర్ మాజీ జడ్పీటీసీ, చింతకుంట సర్పంచ్ నాగం భూమయ్య, సర్పంచ్ బద్దం మహేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు వర్ధినేని నాగేశ్వర్రావు, కల్లెడ శంకర్, ఎండీ రఫీ, సోమ దేవేందర్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, భూమయ్య, గడ్డం శేఖర్‌రెడ్డి, ఏజీబీ మహేందర్, నల్ల గంగాధర్, ఓంకార్, తీట్ల శంకర్, కొత్తపెల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.