నల్గొండ : మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డి అంతక్రియలు( Funeral ) పూర్తయ్యాయి. నాలుగు దశాబ్దాల పాటు నల్గొండ జిల్లా రాజకీయాల్లో తనదైన శైలిలో ముద్ర వేసుకున్న దామోదర్ రెడ్డి ( Damodar Reddy ) అంత్యక్రియలు శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి (Jagadish Reddy ) , తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ గారితో పాటు గుంటకండ్ల రాంచంద్రారెడ్డి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి అంత్యక్రియలో పాల్గొన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, వి. హనుమంత్ రావు , బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు అంత్యక్రియల్లో పాల్గొని నివాళి అర్పించారు.