సంతాపం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్
హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): మాజీ ఐఏఎస్ అధికారి బీ దానం కన్నుమూశారు. శనివారం హైదరాబాద్లోని తన నివాసంలో నిద్రలోనే తుదిశ్వాస విడిచారని కుటుం బసభ్యులు తెలిపారు. దానం ఉమ్మడి ఏపీలో పలు శాఖలకు ముఖ్యకార్యదర్శిగా, పశ్చిమగోదావరి కలెక్టర్గా పనిచేశారు. డాక్టర్ అంబేద్కర్ పీపుల్స్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అధ్యక్షుడిగా సేవలందించారు. దానం మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. దళిత బహుజన మైనారిటీ వర్గాలకు విశేష సేవలందించారని, వారి జీవితాల్లో గుణాత్మక అభివృద్ధి కోసం జీవితాంతం కృషి చేశారని సీఎం స్మరించుకున్నారు.