నార్నూర్ : ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం గుంజాల గ్రామం బోజ్జుగూడకు చెందిన మెస్రం జాలింషావ్ (Mesram Jalimshav ) గుండెపోటుతో మృతి చెందారు. భూపాల పల్లి జిల్లా మహాదేవపూర్ మండలం పంకేని సెక్షన్లో (Forest section officer ) విధులు నిర్వహిస్తున్న ఆయనకు శుక్రవారం తెల్లవారుజామున హఠాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందారు.
శనివారం స్వగృహమైన నార్నూర్ మండలం గుంజాల గ్రామంలోని బోజ్జుగూడలో అంత్యక్రియలు నిర్వహించారు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఫారెస్ట్ సెక్షన్ అధికారికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కొడుకు ఉన్నాడు. అంత్యక్రియలో ఆయా శాఖల అధికారులు, ఆయా సంఘాల నాయకులు, బంధుమిత్రులు పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు.