ఖానాపూర్ ( నిర్మల్ ) : నిర్మల్ జిల్లా ఖానాపూర్ రేంజ్ అటవిశాఖాధికారి లంచం( Bribe ) తీసుకుంటూ ఏసీబీ ( ACB Net ) అధికారులకు పట్టుబడ్డారు. టింబర్ డిపో లైసెన్స్ ( Timber Depo Licence ) రెన్యూవల్‌తో పాటు డిపోపై ఎలాంటి నివేదికను ఉన్నతాధికారులకు అందజేయకుండా ఉండేందుకు సెక్షన్ అధికారి అయిండ్ల రవీందర్‌ను డిపో యజమాని సంప్రదించాడు.
దీంతో లంచం డిమాండ్ చేయడంతో ఫిర్యాదుదారుడు ఆదిలాబాద్ రేంజ్ ఏసీబీ అధికారులను సంప్రదించాడు. గురువారం సెక్షన్ అధికారి రూ. 12 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి కరీంనగర్ కోర్టులో హాజరు పరిచామని ఏసీబీ అధికారులు వెల్లడించారు.