‘తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలి’
ఈ నెల 10, 11వ తేదీల్లో హైదరాబాద్ ఫలక్‌నుమా గిరిజన కాలనీ రవీందర్ నాయక్ నగర్లో జరిగే గిరిజన సంఘం నాలుగో రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని ఆ సంఘం నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి లావుడియా ఎర్రా నాయక్ పిలుపునిచ్చారు. గురువారం దామరచర్లలో...
దామరచర్ల, అక్టోబర్ 08 : ఈ నెల 10, 11వ తేదీల్లో హైదరాబాద్ ఫలక్‌నుమా గిరిజన కాలనీ రవీందర్ నాయక్ నగర్లో జరిగే గిరిజన సంఘం నాలుగో రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని ఆ సంఘం నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి లావుడియా ఎర్రా నాయక్ పిలుపునిచ్చారు. గురువారం దామరచర్లలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ నెల 10న జరిగే ఠానునాయక్ నంగారా ఉత్సవాలను, 11న జరిగే గిరిజన సంఘం నాలుగో రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలన్నారు. 10 తేదీ ఉదయం 11:30 గంటలకు రవీంద్ర నాయక్ నగర్ లిబ్రా హోటల్ నుండి గిరిజన కళా ప్రదర్శన ప్రారంభమవుతుందని చెప్పారు. గిరిజన సంస్కృతిని చాటి చెప్పే విధంగా, గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగు కాకుండా ఉండాలని ఈ ఠాను నాయక్ నంగారా ఉత్సవాలు అలాగే మహాసభలు అని తెలియజేశారు. కావునా జిల్లా వ్యాప్తంగా గిరిజన సోదర సోదరీమణులు పెద్ద ఎత్తున తరలివచ్చి మహాసభను జయప్రదం చేయాలని ఆయన కోరారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

