ఆదిలాబాద్ : ఆదిలాబాద్ ( Adilabad ) జిల్లా బోథ్ ( Both ) మండలం సాకర గ్రామంలో శనివారం బావిలో పడిన ఎలుగుబంటిని (Rescue bear ) అటవీశాఖ అధికారులు కాపాడారు. సమీప అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఎలుగుబంటి ప్రమాదవశాత్తు నీళ్లు లేని బావిలో పడింది. ఎలుగుబంటి అరుపులను గమనించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న అధికారులు తాళ్లు మంచం సహాయంతోఎలుగుబంటిని బయటకు తీశారు. బావి నుంచి బయటకు వచ్చిన అనంతరం ఎలుగుబంటి సమీప అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది.