తాడ్వాయి, జనవరి22 : ములుగు జిల్లా తాడ్వాయి మండలం ఒడ్డుగూడెంలో ఆదివాసీ పోడు రైతులపై అటవీ శాఖ అధికారులు దౌర్జన్యం చేశారు. దశాబ్దాల కాలంగా సాగులో ఉన్న భూముల చుట్ట్టూ అటవీశాఖ అధికారులు గురువారం ట్రెంచ్ పనులు చేస్తుండగా పెద్ద ఎత్తున చేరుకున్న రైతులు పనులు నిలిపివేయాలని కోరారు.
దీంతో అటవీ అధికారులు అడ్డువచ్చిన రైతులను నెట్టివేస్తూ దౌర్జన్యానికి దిగారు. దశాబ్దాల కాలంగా పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, తమ భూములను స్వాధీనం చేసుకునేందుకు అటవీ శాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.