సుల్తాన్‌బజార్,జనవరి 6 : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని ఎంఎన్‌జే క్యాన్సర్ దవాఖానలోని అమ్మవారి ఆలయంలో టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం ముజీబ్‌హుస్సేనీ గురువారం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దవాఖానలో అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 317 జీవోపై ఉద్యోగులు ఎవరూ ఆందోళన చెందవద్దని, అధైర్యపడవద్దని అన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ కార్యదర్శి ఎస్ విక్రమ్‌కుమార్,ఉపాధ్యక్షులు కేఆర్ రాజ్‌కుమార్, ప్రచార కార్యదర్శి కురాడి శ్రీనివాస్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.