బేల : వృక్ష శాస్త్ర సీనియర్ అధ్యాపకులు, ఆదిలాబాద్( Adilabad ) జిల్లాలోని బేల కీర్తన డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ వరప్రసాద్ రావు రాసిన ఫ్లోరా ఆఫ్ తెలంగాణ (Flora of Telangana) గ్రంథాన్ని కాకతీయ అదనపు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ తిరుమల దేవి ఆవిష్కరించారు .
భవిష్యత్లో ఆక్సిజన్ విడుదల చేసే వృక్షాల పై మరో బుక్ రాయనున్నట్లు రచయిత వెల్లడించారు. డాక్టర్ తిరుమల దేవి మాట్లాడుతూ భవిష్యత్లో మరిన్నీ గ్రంథాలు రాసి సమాజం, పర్యావరణ పరిస్థితులపై పుస్తక ప్రియులకు అవగాహన కల్పించాలని కోరారు.