పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు జలమయమవుతున్న లోతట్టు ప్రాంతాలు పంట పొలాల్లోకి భారీగా వరద నీరు
ఊట్కూర్, సెప్టెంబర్ 2 : జిల్లా వ్యాప్తంగా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు మండలాల్లో వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. గ్రామాల్లో చెరువులు, కుంట లు జలకళను సంతరించుకుంటున్నాయి. గతంలో ఎప్పు డూ లేని విధంగా నెల రోజుల నుంచి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలతో వరద ప్రవాహం పెరిగి బీటీ రోడ్లు, కల్వర్టులు సైతం దెబ్బతింటున్నాయి. ప్రత్యేకిం చి జిల్లాలో భారీ వర్షం కురిసిన ప్రతిసారి వరద ఉధృతితో మండలంలోని చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచి ప్రజ లు అవస్థలు పడుతున్నారు. మండలంలోని అమీన్పూర్, పగిడిమర్రి, బిజ్వారం, కొత్తపల్లి, పులిమామిడి, మల్లేపల్లి, వల్లంపల్లి, ధన్వాడ మండలం పాతపల్లి గ్రామాల మధ్య వా గుల వద్ద వరద నీరు కల్వర్టులపై నుంచి ప్రవహిస్తున్నది. ఈ నేపథ్యంలో ఆయా గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కల్వర్టుల వద్ద ప్రయాణించేందుకు వాహనచోదకులు జంకుతున్నారు. మరో పక్క వరద నీరు పంట పొలాల్లోకి చేరుతుండగా పత్తి, కంది, వరి పంటలు నీట మునిగాయి. అయితే పత్తి, కంది పంటలు మళ్లీ కోలుకునే అవకాశం లేదని రైతులు పేర్కొంటున్నారు. మరో పక్క వర్షానికి నీట మునిగిన పంటలను అధికారులు అంచనా వేస్తున్నారు.
కొత్తపల్లి శివారులో వాగు వద్ద దాటేందుకు ఇబ్బంది పడుతున్న ప్రజలు ఫైల్