హైదరాబాద్/ సిటీబ్యూరో, నవంబర్ 1(నమస్తే తెలంగాణ): వాతావరణంలోని మార్పుల వల్ల రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఐదో తేదీ వరకు ఉరుము లు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ కే నాగరత్న తెలిపారు. మంగళవారం మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యా దాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలతోపాటు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నదని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం సోనాలలో అత్యల్పంగా 12.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 20 ప్రాంతాల్లో 12.6 నుంచి 14.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.