ఇన్సూరెన్స్ ఉంటేనే.. ఆర్టీఏలోకి!
వాహనదారులు ఇన్సూరెన్స్‌ల రెన్యువల్లో నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. ఇకపై అలా కుదరదు. ఆర్టీఏలో ఎటువంటి సేవలు పొందాలన్నా ఇకపై ఇన్సూరెన్స్ గడువు తప్పనిసరి. అందుకోసం ఎంవీఐ, ఆర్టీఓలే స్వయంగా పరిశీలించనున్నారు.
- ఏ వాహన సేవలు పొందాలన్నా బీమా తప్పనిసరి
- ఏడాది ఇన్సూరెన్స్ లేకపోతే ఆర్సీ, ఫిట్నెస్, రెన్యువల్ చేయరు
- స్వయంగా పరిశీలించనున్న ఎంవీఐ, ఆర్టీఓ
- ఇన్సూరెన్స్ ఇప్పటికే గడువులో ఉందా? లేకపోతే ఐఐబీ పోర్టల్‌లో చెక్ చేస్తారు.
- 12 నెలల కంటే తక్కువ ఉన్న ఇన్సూరెన్స్ ఉంటే రిజెక్ట్ చేసి ఆ వాహనాలను నిఘా లిస్ట్‌లో చేర్చుతున్నారు.
- జెన్యూన్ అండ్వాలిడ్ ఇన్సూరెన్స్ లేకుండా ఎటువంటి పని చేయరు.
- ప్రతీ ఆఫీసర్ రోజూ వెరిఫై చేసిన ఇన్సూరెన్స్‌ల రిజిస్టర్ మెయింటైన్ చేయాలని ఆదేశాలు అందాయి
వాహనదారులు ఇన్సూరెన్స్‌ల రెన్యువల్లో నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. ఇకపై అలా కుదరదు. ఆర్టీఏలో ఎటువంటి సేవలు పొందాలన్నా ఇకపై ఇన్సూరెన్స్ గడువు తప్పనిసరి. అందుకోసం ఎంవీఐ, ఆర్టీఓలే స్వయంగా పరిశీలించనున్నారు. ఐఐబీ పోర్టల్‌లో పాలసీ నెంబర్, బండి నంబర్, ఇంజిన్, చాసిస్ నంబర్ కరెక్టేనా? కాదా? అని వెరిఫై చేసి ఆరా తీస్తున్నారు. ఏదైనా గడువు లేకుండా ఉంటే వెంటనే రిజక్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు అత్యధికంగా ఆటోలు, క్యాబ్‌లు వన్ మంత్ ఇన్సూరెన్స్‌తో కాలం వెల్లదీశాయి. కానీ ఆర్టీఏలో అక్టోబర్ 21 నుంచి వన్‌మంత్ ఇన్సూరెన్స్‌ను అధికారులు యాక్సెప్ట్ చేయడం లేదు. ఒకనెలకు రూ.1500 లోపు ఖర్చు అయ్యేది.
సిటీబ్యూరో, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): చాలా మంది ఆటో, క్యాబ్ దారులు వన్‌మంత్ ఇన్సూరెన్స్ తీసుకొని తమ వాహనాల ఫిట్నెస్ పొందేవారు. ఇక ఫిట్నెస్ గడువు ఏడాది ఉండటంతో అప్పటి వరకు కేవలం వన్ మంత్ మీదనే రాకపోకలు సాగించే వారు. అధికారులు కూడా తాము ఫిట్నెస్ చేస్తున్నప్పుడు ఆ ఇన్సూరెన్స్ గడువు ఉందా? లేదా? అని చూసి ఫిట్నెస్ ఇచ్చేవారు. అయితే ఈ ప్రక్రియపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఇకపై వన్‌మంత్ ఇన్సూరెన్స్ చెల్లదని తేల్చేశారు. కచ్చితంగా వాహన ఇన్సూరెన్స్ ఏడాది ఉండాల్సిందేనని షరతులు విధించారు. వాలిడ్ ఇన్సూరెన్స్ లేకపోతే ఎటువంటి ఆర్టీఏ సేవలు అందవని అధికారులు హెచ్చరించారు. -ఇక నుంచి ఆర్టీఏ పనులు ఆర్సీ, ట్రాన్స్ఫర్, అడ్రస్ ఛేంజ్,ఫిట్నెస్ రెన్యూవల్, పర్మిట్, వెహికల్ మార్పు, లోన్ తదితర ప్రతీ ఫైల్లో ఆఫీసర్ ఇన్సూరెన్స్‌ను స్వయంగా వెరిఫై చేయాలి. కంప్యూటర్లో యాక్సెప్ట్ అయిందని నమ్మకూడదు.
నిఘా లిస్ట్ల్లోకి వాహనాలు!
వాహన్ పోర్టల్ ప్రక్రియతో తెలంగాణ రాష్ట్ర వాహన వివరాలన్నీ సెంట్రల్ పోర్టల్‌లోకి వెళ్లిపోయాయి. ఇకపై వాహనానికి సంబంధించి ఎటువంటి గడువు తీరినా అక్కడ్నుంచే హెచ్చరిక సందేశాలు వస్తుంటాయి. ఇటీవల మూడు రోజుల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌లో 7 వేల మందికిపైగా హెచ్చరిక సందేశాలు వచ్చాయి. వాళ్లంతా సంబంధిత ఆర్టీఏ కార్యాలయాలను సంప్రదిస్తున్నారని అధికారులు తెలిపారు. ఇన్సూరెన్స్, పీయూసీ గడువు మీరితే వాహనాలను నిఘా లిస్ట్‌లో ఉంచి చర్యలు తీసుకుంటారు. చాలా వరకు కొత్తగా వాహనం కొనుగోలు చేసే సమయంలో మినహా..
ఆ తర్వాత బీమా రెన్యూవల్‌కు ఆసక్తి చూపడం లేదు. ఈ నిర్లక్ష్యమే ప్రాణాల మీదకు వస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇన్సూరెన్స్‌ను భారంగా భావించకుండా రెన్యువల్ చేయించుకోవాలని సూచిస్తున్నారు. గ్రేటర్లో 88 లక్షలు ఉండగా అందులో 47 శాతం వాహనాలు ఇన్సూరెన్స్ రెన్యువల్ లేకుండానే రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. సుమారు 41 లక్షల వాహనాలు ఇన్సూరెన్స్ లేకుండా ఉన్నాయి. మొదటిసారి పట్టుబడితే రూ. 2వేల జరిమానా, రెండోసారి అయితే రూ.4వేల జరిమానా ఉంటుంది.
కొన్ని సందర్భాల్లో వాహనాలు సీజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా రవాణా విభాగంలోని ఆటోరిక్షాలు, ట్రాలీలు, లారీలు, ఇతర సరుకు రవాణా వాహనాలకు ప్రతియేటా ఫిట్నెస్ పరీక్షలు తప్పనిసరి. ప్రతి రోజూ కార్యాలయాలకు 200 నుంచి 500 వాహనాలు ఫిట్నెస్ పరీక్షలకు వస్తుంటాయి. ఈ సమయంలో వాహనం ఆర్సీతోపాటు చె ల్లుబాటు అయ్యే బీమా పత్రం, కాలుష్య నియ ంత్రణ పత్రాలను అధికారులు పరిశీలించి ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ చేస్తారు. ఈ ప్రక్రియ ఇకపై మరింత కఠినంగా మారనుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Autos cabs
- IIB Portal
- Insurance
- RTO
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

