ఓటు నమోదులో ఎన్నికల కమిషన్ విఫలం
ఎన్నికల కమిషన్ తన బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమవుతున్నదని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం ఆయన బన్సీలాల్‌పేట్ డివిజన్లోని గాంధీనగర్ కమ్యూనిటీ హాల్, పద్మారావునగర్ డివిజన్లోని బోయిగూడ పాటిదార్ సమాజ్ భవన్లో నిర్వహించిన పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాలలో పాల్గొన్నారు.
-
ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం
బన్సీలాల్‌పేట్, అక్టోబర్ 31 : ఎన్నికల కమిషన్ తన బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమవుతున్నదని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం ఆయన బన్సీలాల్‌పేట్ డివిజన్లోని గాంధీనగర్ కమ్యూనిటీ హాల్, పద్మారావునగర్ డివిజన్లోని బోయిగూడ పాటిదార్ సమాజ్ భవన్లో నిర్వహించిన పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు అనేది రాజ్యంగం కల్పించిన హక్కు అని, ప్రతి ఒక్కరూ తమ ఓటును నమోదు చేసుకోవాలన్నారు. వాస్తవానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ఓటరు నమోదు చేపట్టాలన్నారు. ఎన్నికల కమిషన్ పట్టించుకోకపోవడం వల్ల బీఆర్ఎస్ పార్టీ రంగంలోకి దిగి ఇంటింటికి వెళ్లి ఓటరు నమోదు చేయాల్సివస్తున్నదని తెలిపారు.
తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంతో కష్టపడి సేకరించిన నమోదు ఫారాలను అధికారులకు ఇస్తే వారు అనేక ఇబ్బందులకు మిగతాగురి చేస్తున్నారని చెప్పారు. గత గ్రాడ్యూయేట్ ఎన్నికల్లో ఓటు వేసిన వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలనడం విడ్డూరంగా ఉన్నదన్నారు. ఇదే విషయాన్ని ఎన్నికల అధికారులను ప్రశ్నిస్తే సరైన జవాబు లేదన్నారు. హైదరాబాద్ నగరంలో కోటికి పైగా జనాభా ఉన్నదని, అందులో కేవలం లక్ష మంది మాత్రమే ఇప్పటి వరకు నమోదు చేసుకోగలిగారని తెలిపారు. పద్మారావునగర్ బీఆర్ఎస్ ఇన్చార్జీ పవన్‌కుమార్ గౌడ్, మాజీ కార్పొరేటర్ కే.హేమలత లక్ష్మీపతి, ఏసూరి సావిత్రి మహేశ్, డివిజన్ అధ్యక్షుడు వెంకటేశన్ రాజు, కార్యదర్శులు మహేందర్, రాజేందర్, గాంధీనగర్ కాలనీ అధ్యక్షుడు మురళీరమణ, కార్యదర్శి రవికాంత్, సీనియర్ సిటిజెన్స్ అధ్యక్షుడు నర్సింహ, డి.అశోక్ కుమార్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

