పాలకుర్తి, సెప్టెంబర్ 13 : పాలకుర్తి మండలం బసంత్ నగర్ అల్ట్రా టెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో శనివారం మైన్స్ సేఫ్టీ వీక్ & ప్రొడక్టివిటీ అసోసియేషన్ 2025, DGMS హైదరాబాద్ ఆధ్వర్యంలో ప్రథమ చికిత్స ట్రేడ్ టెస్ట్ పోటీలు నిర్వహించారు. సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ (SMP) కింద జోన్–1 (గ్రూప్ B & C మైన్స్) స్థాయిలో నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి 8 సిమెంట్ ప్లాంట్లకు చెందిన 45 మంది ఈ ట్రేడ్ టెస్ట్‌లో పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ప్రధాన అతిథిగా హాజరయ్యారు. ప్లాంట్ హెడ్ ఎం. శ్రీనివాస్ రెడ్డి, హెచ్ఆర్ హెడ్ పార్థ సారథి, మైన్స్ హెడ్ జి.పి.సాహు కలిసి పోటీలో పాల్గొన్న మైన్స్ కార్మికులను ప్రోత్సహించారు. అత్యవసర పరిస్థితుల్లో “గోల్డెన్ అవర్”లో ప్రథమ చికిత్స ఎంత ముఖ్యమో వివరించారు. డాక్టర్ రాము, డాక్టర్ నవీన్, మైన్స్ అధికారులు ఎం.రవి, సుదర్శన్ రెడ్డి, కె.వి.ఎస్. ప్రసాద్, పి.సత్యనారాయణ రావు నేతృత్వంలోని మైన్స్ బృందం ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది.