బేగంపేట్, నవంబర్ 30: ఓ కారులో నుంచి దట్టమైన పొగలు రాగా పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటన సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం ఉదయం జరిగింది. తార్నాకకు చెందిన శివశంకర్ బంజారాహిల్స్‌లో సివిల్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. మంగళవారం ఉదయం 10.30 గంటల సమయంలో శివశంకర్ తన కారులో ఆఫీస్‌కు బయలుదేరాడు. సికింద్రాబాద్ హరిహర కళాభవన్ వద్ద ఉన్న ఫ్లై ఓవర్ పైకి రాగానే కారు ఇంజిన్‌లో పొగలు రావడాన్ని గమనించాడు. వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలానికి చేరుకున్న వారు మంటలు ఆర్పారు.