చందూర్, ఏప్రిల్ 11 : కావాల్సిన వారి వడ్లు మాత్రమే కాంటా వేసి, మిగతా వారిని పట్టించుకోవడం లేదంటూ రైతులు ఆందోళనకు దిగారు. నిజామాబాద్ జిల్లా చందూర్ మండలంలోని మేడ్పల్లి, కారేగాం, లక్ష్మాపూర్ గ్రామాలకు చెందిన రైతులు లక్ష్మాపూర్ సొసైటీకి ధాన్యం తీసుకొచ్చారు. పంట కోసి రోజులు గడుస్తున్నా కాంటాలు వేయడం లేదని, కావాల్సిన వారికి వెంటవెంటనే కాంటాలు వేస్తున్నారంటూ శుక్రవాంర సొసైటీ ఎదుట బైఠాయించారు. అకాల వర్షాల నుంచి ధాన్యాన్ని కాపాడుకోవడానికి ఇబ్బంది పడుతున్నామని, వెంటనే తమ వడ్లు కాంటా వేయాలని డిమాండ్ చేశారు. సొసైటీ చైర్మన్ అశోక్ నిర్వాహకుల పక్షాన రైతులకు క్షమాపణ చెప్పారు. మరోసారి ఇలా జరగకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.