ఔటర్‌పై కారులో మంటలు.. ఒకరికి తీవ్ర గాయాలు
కారులో మంటలు | శంషాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డుపై గురువారం కారులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. వాహనం నడుస్తున్న క్రమంలో కారు ఇంజిన్‌లో

హైదరాబాద్ : శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై కారులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఔటర్ రింగ్ రోడ్డుపై నుంచి శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వెళ్తుండగా.. ఎయిర్ పోర్ట్ కాలనీ వద్దకు రాగానే ఒక్కసారిగా కారు ఇంజిన్‌లో నుంచి మంటలు చెలరేగాయి. కారులో ఉన్న డ్రైవర్‌కు మంటలు అంటుకొని.. అందులో చిక్కుకుపోయాడు. వెనుకాలే వస్తున్న లారీ, ఆటో డ్రైవర్ గమనించి వెంటనే అతన్ని కారు నుంచి బయటకు తీశారు. అనంతరం 108 వాహనంలో హాస్పిటల్‌కు తరలించారు. గాయపడ్డ వ్యక్తి రంగారెడ్డి జిల్లా కొత్తూర్ మండలం తిమ్మాపూర్‌కు చెందిన శ్రీకాంత్‌గా గుర్తించారు. శ్రీకాంత్ మంటల్లో చిక్కుకుని తీవ్రంగా గాయపడడంతో అతని పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

