ఢిల్లీ హాస్పిటల్లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం
ఢిల్లీ హాస్పిటల్లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం | దేశ రాజధాని ఢిల్లీ వికాస్పురి ప్రాంతంలోని యూకే నర్సింగ్ హోమ్‌లో మంగళవారం అర్ధరాత్రి మంటలు చెలరేగాయి.

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ వికాస్పురి ప్రాంతంలోని యూకే నర్సింగ్ హోమ్‌లో మంగళవారం అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. అయితే ఇందులో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు పేర్కొన్నారు. ప్రమాదంలో 17 కొవిడ్ రోగులతో సహా మొత్తం 26 మందిని రక్షించినట్లు ఢిల్లీ ఫైర్ సర్వీస్ డైరెక్టర్ అతుల్ గార్డ్ తెలిపారు. ఘటన రాత్రి 11 గంటల సమయంలో జరిగిందని, ఎనిమిది ఫైర్ టెండర్లు సంఘటనా స్థలానికి తరలించి గంటలోపే మంటలు అదుపులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.

ఆసుపత్రి సిబ్బంది సహాయంతో రోగులందరినీ రక్షించామని, వారంతా సురక్షితంగానే ఉన్నారని పేర్కొన్నారు. రోగులను దగ్గరలోని ఇతర దవాఖానలకు తరలించి, చికిత్స అందిస్తున్నారు. భవనం మొదటి అంతస్థులో ఉన్న మంటలు చెలరేగాయని సమాచారం. షార్ట్ సర్క్యూట్‌తోనే మంటలు చెలరేగాయని భావిస్తున్నారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భవనం మొత్తం పొగ వ్యాపించింది. హాస్పిటల్లో ఉన్న రోగులకు సురక్షితంగా బయటపడడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.
ఇవి కూడా చదవండి..
కరోనా వేళ కలప సాయం
బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించండి
ప్లాస్మా మాకివ్వరూ!
వ్యాక్సినేషన్ పేరిట ఫేక్‌కాల్స్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

