లక్నో: లక్నోలోని హజ్రత్ఘంజ్ ప్రాంతంలో ఉన్న ఓ హోటల్లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు. హోటల్లో ఇంకా ఎవరైనా చిక్కుకుని ఉంటారేమో అని అగ్నిమాపక సిబ్బంది తనిఖీ నిర్వహిస్తోంది. మదన్ మోహన్ మాల్వియా మార్గ్‌లో ఉన్న లెవనా సూట్స్‌లో ఈ ప్రమాదం జరిగింది. హోటల్ బిల్డింగ్‌లో మొత్తం 30 రూమ్‌లు ఉన్నాయి. ప్రమాద సమయంలో 18 రూమ్‌లు ఫుల్ ఉన్నట్లు ఓనర్ తెలిపారు. హోటల్లో మొత్తం 40 మంది ఉన్నట్లు ఆయన వెల్లడించారు. అగ్నిమాపక సిబ్బంది అలర్ట్‌గా ఉందని, గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.