Carry Bag | నాంపల్లి కోర్టులు, జనవరి 3 (నమస్తే తెలంగాణ) : రిలయన్స్ ట్రెండ్స్‌లో వినియోగదారులకు క్యారీబ్యాగ్లపై రూ.7 చార్జీ వేయడంపై వినియోగదారుల ఫోరం చర్యలు తీసుకుంది. వినియోగదారులపై ఒత్తిడి తెచ్చినైట్లెతే రూ.3వేలను జరిమానాగా చెల్లించాలని వినియోగదారుల కమిషన్ తీర్పు వెల్లడించింది.
ఇటీవల ఢిల్లీ కమిషన్ సభ్యులు మల్హోత్రా, రెష్మీబన్సాల్, రవికుమార్ సమక్షంలో ఫిర్యాదు దారుడిచ్చిన ఫిర్యాదుపై ఆదేశాలను జారీ చేశారు. బలవంతంగా క్యారీబ్యాగులకు రూ.7 కలిపి బిల్లు వేయడం పట్ల ఇచ్చిన ఫిర్యాదును పరిగణలోకి తీసుకుంది. ఈ మేరకు పై విధంగా చర్యలు తీసుకుంది.