chiranjeevi | తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వర్కర్స్ ఫెడరేషన్‌కు చెందిన 24 కార్మిక సంఘాలు వేతనాల పెంపు కోసం సినిమా షూటింగ్‌లను నిలిపివేసి బంద్‌కు కొనసాగిస్తున్నారని తెలిసిందే. వర్కర్ల వేతనాలను 30 శాతం మేర పెంచాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కాగా ఆదివారం చిరంజీవితో చిన్న నిర్మాతలు సమావేశమైన విషయం తెలిసిందే. సినీ కార్మికుల సమ్మె, చిన్న నిర్మాతల సమస్యలపై ఈ భేటీలో చర్చించారు.
అనంతరం నిర్మాత నట్టికుమార్ మీడియాతో మాట్లాడుతూ.. మా బాధలను చిరంజీవికి వివరించామని అన్నారు. చిన్న సినిమాలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరాం. రేపు ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులతో మాట్లాడుతానని చిరంజీవి అన్నారని చెప్పారు.
ఈ మేరకు నేడు ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు చిరంజీవి ఇంటికెళ్లారు. వల్లభనేని అనిల్, అమ్మిరాజుతోపాటు పలువురు చిరంజీవితో తమ సమస్యలను వివరిస్తున్నట్టు సమాచారం. మరోవైపు ఫిల్మ్ చాంబర్లో సినీ నిర్మాతలు సమావేశమై కార్మికుల వేతనాల పెంపు డిమాండ్లపై చర్చించారు.
Rahul Sipligunj | ఆస్కార్ విన్నర్ ఇలా సర్ప్రైజ్ ఇచ్చాడేంటి… సైలెంట్‌గా ఆమెతో నిశ్చితార్థం
Mega Heroes| రెండేళ్లలో మెగా హీరోలు 8 ఫ్లాపులు ఇచ్చారా.. బన్నీ ఒక్కడే నిలబడ్డాడు..!
Newyork India Day Parade | పరేడ్‌లో జంటగా కనిపించిన విజయ్ దేవరకొండ- రష్మిక.. వీడియో వైరల్