Mega Heroes| టాలీవుడ్లో మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్ లాంటి ఎనిమిది మంది హీరోలు ఉన్నారు. వీరి సినిమాలు ప్రతీ ఏడాది ప్రేక్షకుల ముందు వస్తుంటాయి. కానీ, ఇటీవల కాలంలో వీరి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సత్తా చూపలేకపోతున్నాయి. గత రెండు సంవత్సరాల్లో ఈ కుటుంబానికి చెందిన ఎనిమిది సినిమాలు డిజాస్టర్లుగా నిలిచి, దాదాపు రూ.400 కోట్లకు పైగా నష్టాలను తీసుకొచ్చినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
అల్లు అర్జున్ మాత్రం పుష్ప 2తో ఇండస్ట్రీ రేంజ్ హిట్‌ను అందుకున్నారు. మిగిలిన మెగా హీరోలతో పోలిస్తే ఆయన సినిమా కమర్షిషయల్గా కూడా భారీ విజయాన్ని సాధించింది. 2023లో చిరంజీవి హీరోగా వచ్చిన భోళా శంకర్ సినిమా ఘోర పరాజయాన్ని చవిచూసింది. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తక్కువ బజ్‌తో వచ్చినా, ఆఖరికి రూ.55 కోట్ల వరకు నష్టం మిగిల్చినట్టు సమాచారం.ఇక పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీరమల్లు చిత్రం బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచి రూ.85 కోట్ల నష్టం మిగిల్చింది. అలాగే, సాయి ధరమ్ తేజ్‌తో కలిసి నటించిన బ్రో చిత్రం కూడా డిజప్పాయింట్ చేసి రూ.40 కోట్ల నష్టాన్ని తీసుకొచ్చింది. పవన్ నుండి రాబోయే ఓజీపై మెగా అభిమానుల ఆశలు పెట్టున్నారు.
ఇక శంకర్ దర్శకత్వంలో తెరకెక్కి భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన గేమ్ ఛేంజర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రం సంక్రాంతికి విడుదలై భారీ హైప్ మధ్య రిలీజ్ అయినా, చివరకు దాదాపు రూ.100 కోట్ల నష్టాన్ని మిగిల్చింది. వరుణ్ తేజ్ నటించిన గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్, మట్కా..ఈ మూడు సినిమాలూ వరుసగా ఫెయిలయ్యాయి. ఈ మూడు చిత్రాలు కలిపి దాదాపు రూ.80 కోట్ల నష్టాన్ని తెచ్చినట్టు ట్రేడ్ వర్గాల అంచనా. ఉప్పెనతో మంచి హిట్ అందుకున్న వైష్ణవ్ తేజ్, ఆ తర్వాత వచ్చిన సినిమాలతో అదెంతా నిలబెట్టుకోలేకపోయాడు. ఆదికేశవ చిత్రం పెద్దగా ఆడకపోవడంతో దాదాపు రూ.27 కోట్ల నష్టం మిగిలిందని సమాచారం. ఇలా గత రెండు సంవత్సరాల్లో మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన ఎనిమిది సినిమాలు డిజాస్టర్‌గా నిలిచి, కలిపి రూ.400 కోట్ల వరకు నష్టాలు తీసుకొచ్చాయని అంటున్నారు. ప్రస్తుతం మెగా అభిమానులంతా మరికొద్ది రోజులలో విడుదల కానున్న ఓజీ, విశ్వంభర, లాంటి సినిమాలపై చాలా హోప్స్ పెట్టుకున్నారు.