తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల ( Tirumala ) వేంకటేశ్వరస్వామిని పలువురు సినీ ప్రముఖులు బుధవారం దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ( Dil Raju ) , నటుడు అశోక్ కుమార్, కన్నడ సినీనటుడు పునీత్ రాజ్ కుమార్ సతీమణి అశ్వినీ పునీత్ రాజ్ కుమార్, గాలి జనార్ధన్‌రెడ్డి, ఆయన కుమారుడు కిరీటి ( Kiriti) తదితరులు స్వామివారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా టీటీడీ (TTD ) అధికారులు ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచన, తీర్థప్రసాదాలను అందజేశారు.
శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.89 కోట్లు
తిరుమలలో శ్రీవారి హుండీకి( Hundi ) రూ. 4.89 కోట్లు భక్తులు మొక్కుల ద్వారా సమర్పిచుకున్నారని ఆలయ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 75,183 మంది భక్తులు దర్శించుకోగా 25,906 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 18 కంపార్టుమెంట్లలో వేచి ఉండగా టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం అవుతుందని వెల్లడించారు.