భువనేశ్వర్: ఎఫ్ఐహెచ్ మహిళల హాకీ ప్రపంచకప్‌లో భారత్ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను ఎదుర్కొనుంది. జూలై 1 నుంచి మొదలుకానున్న మెగాటోర్నీ షెడ్యూల్‌ను మంగళవారం అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) విడుదల చేసింది. టోర్నీలో పాల్గొంటున్న 16 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించగా.. పూల్-బిలో భారత్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, చైనా ఉన్నాయి. జూలై 5న చైనాతో, 7న న్యూజిలాండ్‌తో మన అమ్మాయిలు తలపడనున్నారు. ఆసియా కప్‌లో కాంస్యం పొందిన భారత మహిళలు ప్రస్తుతం కొనసాగుతున్న హాకీ ప్రో లీగ్‌లో సత్తా చాటుతున్నారు. ఈ లీగ్‌లో భాగంగా టీమ్ఇండియా ఈనెల 12, 13న జర్మనీతో పోరాడనుంది.