కొత్తగూడెం సింగరేణి, డిసెంబర్ 10: సింగరేణిలోని నాలుగు బొగ్గు బ్లాకులకు కేంద్రం బహిరంగ వేలం వేయడాన్ని నిరసిస్తూ టీబీజీకేఎస్‌తో పాటు జాతీయ సంఘాల నాయకులు శుక్రవారం రెండోరోజూ సంస్థ వ్యాప్తంగా సమ్మె చేపట్టారు. సంస్థ వ్యాప్తంగా ఉన్న 11 ఏరియాల్లో జాక్ నాయకులు ప్రీ షిప్టు నుంచి అన్ని భూగర్భ గనులు, ఓపెన్‌కాస్టు గనులు, డిపార్ట్మెంట్ల కార్యాలయాలు, కొత్తగూడెం కార్పొరేట్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.
కోయగూడెం ఓసీ పరిధిలో..
టేకులపల్లి, డిసెంబర్ 10: కోయగూడెం ఓసీలో శుక్రవారం సింగరేణి కార్మికులు రెండో రోజు సమ్మె నిర్వహించారు. సమ్మెలో అఖిల పక్ష నాయకులు రేపాకుల శ్రీనివాస్, కనుదుల వీరన్న, ధర్మపురి వీరబ్రహ్మాచారి, బానోత్ ఊక్లా, గుగులోత్ రాంచంద్రు, కుంజ రమేశ్, సుందర్, హర్జ్య, చిట్టిబాబు, నాగేంద్ర బాబు, రామకృష్ణ, రామయ్య, శ్రీను పాల్గొన్నారు.
మణుగూరు ఏరియాలో..
మణుగూరు రూరల్, డిసెంబర్ 10: మణుగూరు ఏరియాలో శుక్రవారం 500 మందికి పైగా కార్మికులు పట్టణంలోని రైల్వే గేట్ నుంచి కూనవరం, పీవీ కాలనీ మీదుగా అంబేడ్కర్ పార్క్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసన వ్యక్తం చేశారు. బొగ్గు బ్లాక్‌ల వేలాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సమ్మెలో పాల్గొన్నారు. సమ్మె కారణంగా ఏరియాలో సుమారు 30 వేల టన్నులకు పైగా బొగ్గు ఉత్పత్తి నిలిచింది. సమ్మెలో టీబీజీకేఎస్ బ్రాంచి ఉపాధ్యక్షుడు వి.ప్రభాకర్‌రావు, లెవన్ మెన్ కమిటీ మెంబర్ సామా శ్రీనివాసరెడ్డి, నాయకులు కోటా శ్రీనివాసరావు, అబ్దుల్ రవూఫ్, వీరభద్రం, అశోక్, పిట్ సెక్రటరీ నాగెళ్లి వెంకట్, ఇంతియాజ్‌పాషా, రామారావు, జేఏసీ నాయకులు, టీబీజీకేఎస్, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, బీఎంఎస్, హెచ్ఎంఎస్, ఇఫ్టూ నాయకులు పాల్గొన్నారు.
కొత్తగూడెం ఏరియాలో..
రామవరం, డిసెంబర్ 10: సింగరేణి కొత్తగూడెం ఏరియాలో శుక్రవారం కార్మికులు రెండో రోజు సమ్మె నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాక్‌ల వేలాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. సమ్మె కారణంగా ఏరియాలోని బావులన్నీ బోసిపోయాయి. బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచింది. గురు, శుక్రవారాల్లో సమ్మె కారణంగా ఏరియాలో సుమారు లక్ష టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. రైలు ద్వారా రవాణా అయ్యే 60 వేల టన్నుల బొగ్గు రవాణా నిలిచిపోయింది. సమ్మెలో టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు ఎండీ రజాక్, 11మెన్ కమిటీ మెంబర్ కాపు కృష్ణ, జాతీయ సంఘాల నాయకులు శేషయ్య, వీరస్వామి, నాగభూషణం, ఆల్బర్ట్, గోడ రమేశ్, ఆంజనేయులు, మందా నరసింహారావు, శ్రీనివాస్, పి.మాధవ్‌నాయక్, టీబీజీకేఎస్ నాయకులు రాజయ్య, నాగరాజు, గౌస్, సత్తార్‌పాషా, శంకర్, నటరాజ్, కుమార్, శేఖర్‌బాబు, నరసింగం, సూరిబాబు, మురాద్, విప్లవరెడ్డి, మోహన్‌రెడ్డి, కుమారస్వామి, రాజేశ్వరరావు పాల్గొన్నారు.
జేవీఆర్, కిష్టారం ఓసీల పరిధిలో..
సత్తుపల్లి, డిసెంబర్ 10: అఖిల పక్షం ఆధ్వర్యంలో శుక్రవారం 774 మంది సింగరేణి కార్మికులు జేవీఆర్ ఓసీ పరిధిలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి రెండో రోజు సమ్మె చేపట్టారు. బొగ్గు బ్లాక్‌ల వేలాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. సమ్మె కారణంగా ఓసీలో 30 వేల టన్నులు, కిష్టారం ఓసీలో 10వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. అన్ని విభాగాల కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొన్నారు. సమ్మెలో నాయకులు చెన్నకేశవరావు, మురళి, భీమయ్య, వెంకట్, అజఘర్ఖాన్, చంద్రశేఖర్, వెంకటరమణ, శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, యూసఫ్, తడికమళ్ల యోబు, దండు ఆదినారాయణ పాల్గొన్నారు.
ఇల్లెందు ఏరియాలో..
ఇల్లెందు, డిసెంబర్ 10: బొగ్గు బ్లాక్‌ల వేలంపై సింగరేణి కార్మికులు ఉధృతంగా సమ్మె చేస్తున్నారని టీబీజీకేఎస్ బ్రాంచి ఉపాధ్యక్షుడు ఎస్ రంగనాథ్ అన్నారు. శుక్రవారం ఆయన ఇల్లెందు ఏరియాలో నిర్వహించిన రెండో రోజు సమ్మెలో మాట్లాడుతూ.. కార్మికులందరూ ఒక్కటిగా సమ్మె చేస్తున్నారన్నారు. కేంద్రప్రభుత్వం వేలాన్ని రద్దు చేయకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామన్నారు. కేంద్రం మొండిపట్టు వీడాలన్నారు. సమ్మెలో టీబీజీకేఎస్, అఖిల పక్షనాయకులు పాల్గొన్నారు.
బొగ్గు లోడు లారీలను అడ్డుకున్న జేఏసీ నాయకులు
రామవరం, డిసెంబర్ 10: సింగరేణి జేవీఆర్వోసీ వద్ద కార్మికులు రెండోరోజు సమ్మె చేస్తుండగా ఓసీ నుంచి బొగ్గు లోడుతో వెళ్తున్న లారీలను టీబీజీకేఎస్, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్, సీఐటీయూ, బీఎంఎస్ కార్మిక నేతలు అడ్డుకున్నారు.