మెక్సికో సిటీ : క్రీడా ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూసిన సమయం రానే వచ్చింది. ప్రతిష్టాత్మక ఫిఫా వరల్డ్ కప్ అట్టహాసంగా మొదలైంది. ఆతిథ్య మెక్సికో సిటీలోని ఎస్టాడియో అజ్టెకా స్టేడియం వేదికగా గురువారం రాత్రి జరిగిన ఆరంభ వేడుకలు జిగేల్మన్నాయి. స్టేడియం మధ్యలో ఉంచిన భారీ ప్రపంచకప్ ట్రోఫీ ప్రతిరూపం చుట్టూ మెక్సికో సాంప్రదాయ, ఆధునిక నృత్యకారులు చేసిన ప్రదర్శనతో వేడుకలు మొదలయ్యాయి.
ఈ ఈవెంట్కే ప్రధాన ఆకర్షణగా నిలిచిన గ్లోబల్ పాప్ సెన్సేషన్ షకీరా మైదానంలోకి అడుగుపెట్టగానే అభిమానుల కేరింతలతో అజ్టెకా స్టేడియం దద్దరిల్లింది. ప్రముఖ సింగర్ బర్నా బాయ్ జతకలిసిన షకీరా స్టేడియాన్ని డ్యాన్స్ ఫ్లోర్గా మార్చేసింది. ఈ టోర్నీ అధికారిక సాంగ్ ‘దాయ్ దాయ్’ పాటకు తన ప్రదర్శనతో షకీరా స్టేడియాన్ని ఊపేసింది. అనంతరం మెక్సికో, దక్షిణాఫ్రికా తొలి పోరుకు సిద్ధమయ్యాయి.