వనపర్తి, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పెం డింగ్ పనుల్లో వేగం పెంచాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌లోని మంత్రి నివాసం లో వనపర్తి జిల్లాలోని ఇరిగేషన్ పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సాగునీటి రంగానికి సంబంధించిన పనులు సత్వరమే పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. నిర్ణీత సమయంలోగా కాలు వ పనులు చే పట్టాలని సూచించారు. ఆరు నెలల్లో ఘణపురం బ్రాంచ్ కెనాల్ పను లు పూర్తి కావాలని స్పష్టం చేశారు. తవ్వకం పనులు పూర్తికాగా మిగిలి ఉన్న స్ట్రక్చర్లు, బ్రిడ్జి పనులు వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఘణపురం కాలువ మీద షాపూర్ వయోడక్ట్ పనులు మూడు నెలల్లో, మామిడిమాడ రిజర్వాయర్ పను లు త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ రెండు పనులకు సంబంధించి ఒక ఏఈ, డీఈ ని ప్రత్యేకంగా నియమించి పనుల పురోగతిని ఎప్పటికప్పుడు తెలియజేయాలని కోరారు. నాణ్యత విషయంలో రాజీ పడొద్దని, తేడా వస్తే సహించేది లేదని తేల్చిచెప్పారు. సంవత్సరంలోగా డిస్ట్రిబ్యూటరీ కాలువలన్నీ పూర్తి చేసి వనపర్తి నియోజకవర్గంలోని సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరాకూ నీరందేలా చూడాలన్నారు. ఆశించిన స్థాయిలో పనిచేయని కాంట్రాక్టర్లను పనుల నుంచి తప్పిస్తామని హెచ్చరించారు. భూసేకరణ విషయంలో ఇబ్బందులుంటే రెవెన్యూ అధికారులతో కలిసి వెం టనే పరిష్కరించాలని సూచించారు. బుద్ధారం కుడి, ఎడమ కాలువల మీద స్ట్రక్చర్లు పూర్తిచేయాలన్నారు. మిగిలిపోయిన కాలువలను వెంటనే తవ్వాలని, డీ-8 కాలువ లైనింగ్ ప్రతిపాదనలు వెంటనే ప్రభుత్వానికి పంపాలన్నారు. పెరిగిన ఆయకట్టును పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు. కాలువ సామర్థ్యాన్ని పెంచుతూ లైనింగ్ చేపట్టాలన్నారు. వనపర్తి నియోజకవర్గంలోని డీ-8 కింద ఎంజే 1, 3, 4 ఎంజే-3ఏ కాలువల మీద పెండింగ్ పనులు, అన్ని కాలువలపై ఆఫ్‌టెక్ స్ట్రక్చర్లను నిర్మించి షెట్టర్లు బిగించాలన్నారు. ఏదుల రిజర్వాయర్ తూము తొందరగా ఏర్పాటు చేయాలన్నారు. పాన్‌గల్ బ్రాంచ్ కెనాల్‌పై పెరిగిన ఆయకట్టు మేరకు లైనింగ్ ప్రతిపాదన లు ప్రభుత్వానికి పంపించాలని కోరారు. బుద్ధారం కాలువపై డిస్ట్రిబ్యూటరీ ఆయక ట్టు పనులను వెంటనే చేపట్టాలన్నారు. ఇ టీవల ప్రభుత్వం ప్రకటించిన చెక్‌డ్యాంలకు త్వరగా టెండర్లు పిలిచి 60 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. వెల్టూరు, మహాభూపాల సముద్రం, బుద్ధారం చెరు వు కెపాసిటీ పెంపు పనులు వెంటనే ప్రా రంభించాలన్నారు. సమీక్షలో సీఈ హమీద్‌ఖాన్, రఘునాథ్‌రావు, ఎస్ఈలు సత్యశీలారెడ్డి, విజయ్‌భాస్కర్ రెడ్డి, ఈఈలు, డీఈలు తదితరులు పాల్గొన్నారు.
చెన్నకేశవ స్వామికి బ్రహ్మోత్సవ శోభ
జడ్చర్ల టౌన్, ఫిబ్రవరి 2 : రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన గంగాపురం లక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు బుధవా రం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకుల వేదమంత్రోచ్ఛరణల మధ్య స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామికి పుణ్యాహవచనం, అ మ్మవారికి అష్టోత్తర శత(108) కలశాలతో అభిషేకం నిర్వహించారు. భక్తుల సౌకర్యా ర్థం ఏర్పాట్లు చేసినట్లు ఈవో తెలిపారు.