హనుమకొండ చౌరస్తా, జూలై 25: ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణలో ప్రముఖ సంతాన సాఫల్య కేంద్రం ‘ఫెర్టీ9’కు ఈ ఏడాది అంతర్జాతీయ స్థాయిలో విశిష్ట గుర్తింపు లభించింది. ఫెర్టీ9 క్లినికల్ బృందం ప్రపంచ ప్రఖ్యాత సదస్సుల్లో తమ పరిశోధనా పత్రాలను సమర్పించి.. సంస్థ ప్రతిష్ఠను మరింత పెంచిందని వరంగల్ ఫెర్టీ9 రిప్రొడక్టివ్ మెడిసిన్ అండ్ గైనకాలజీ, డిప్యూటీ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ అనూష కూషణపల్లి తెలిపారు.
‘ఫెర్టీ9’కు అంతర్జాతీయ గుర్తింపు వచ్చిన సందర్భంగా ఐదేళ్లుగా నిర్వహించిన ఐయూఐ చికిత్సల ఫలితాలపై ఆధారపడి చేసిన ఈ పరిశోధన వివరాలను డాక్టర్ అనూష కూషణపల్లి వెల్లడించారు. మహిళల్లో పెరుగుతున్న వివాహ వయస్సు, ఉద్యోగ జీవనశైలి, నైట్ షిఫ్ట్‌ల ప్రభావం.. అలానే పురుషుల్లో వీర్యకణాల్లో నాణ్యత తగ్గడం, డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ పెరగడం వంటి పలు అంశాలు సంతానోత్పత్తిపై చూపుతున్న ప్రభావాన్ని డాక్టర్ అనూష విశ్లేషించారు.
భారతదేశంలో మొత్తం సంతానోత్పత్తి రేటు క్రమంగా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో.. తెలంగాణలో ఇది 1.8, ఆంధ్రప్రదేశ్‌లో 1.7కు చేరిందని ఆమె పేరకొన్నారు. మారుతున్న జీవనశైలి, ఆలస్యంగా వివాహాలు, ఉద్యోగ ఒత్తిడి, మహిళల్లో పీసీవోఎస్, పురుషుల్లో వీర్యకణాల నాణ్యతలో మార్పులు వంటి కారణాల వలన సంతాన సమస్యలు పెరుగుతున్నాయని డాక్టర్ అనూష తెలిపారు.
అయితే.. సరైన సమయంలో నిపుణులను సంప్రదించి అవసరమైన పరీక్షలు, ఆధునిక ఫెర్టిలిటీ చికిత్సలు ప్రారంభిస్తే సంతానోత్పత్తి విజయావకాశాలు మరింత మెరుగుపడతాయని ఆమె చెప్పారు. ఫెర్టీ9 వరంగల్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అత్యాధునిక సాంకేతికత, వ్యక్తిగత వైద్య సంరక్షణతో ప్రతి దంపతికి ఉత్తమ ఫెర్టిలిటీ సేవలను అందించేందుకు కట్టుబడి ఉన్నట్లు డాక్టర్ అనూష తెలిపారు.