తాండూర్ : రైతులకు అవసరమైన ఎరువులు ( Fertilizers ) అందుబాటులో ఉంచాలని తహసీల్దార్ జ్యోత్స్న( Tahasildar Jyothsna), మాదారం ఎస్సై సౌజన్య, మండల వ్యవసాయాధికారి కే సుష్మ ఫెర్టిలైజర్ దుకాణాల యజమానులకు సూచించారు. మండలంలోని హనుమాన్ ఫెర్టిలైజర్, ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం కాసిపేట, ఇతర ఫెర్టిలైజర్ దుకాణాలను శుక్రవారం రెవెన్యూ ( Revenue) , పోలీసు(Police) , వ్యవసాయ( Agricultur) శాఖ ఆధ్వర్యంలో అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫెర్టిలైజర్ దుకాణ యజమానులు రైతులకు ఎరువులను అధిక ధరలకు అమ్మిన, ఇతర ఎరువులకు లింకు చేసి అమ్మినా తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నకిలీ ఎరువులను ఎట్టి పరిస్థితుల్లో విక్రయించరాదన్నారు. దుకాణాల్లో ఏ విత్తనాలు తీసుకున్న తప్పనిసరిగా రైతులు రసీదును తీసుకోవాలని, యజమానులు కూడా తప్పకుండా రశీదు ఇవ్వాలన్నారు. ప్రతి ఎరువుల దుకాణం ముందు స్టాకు నిలువలు, ధరల పట్టిక రైతులకు కనపడేలా ప్రదర్శించాలని చెప్పారు. యూరియాను వ్యవసాయ సాగు కొరకు మాత్రమే అమ్మాలని సూచించారు. వారి వెంట ఏఈవో వెంకటేష్ ఉన్నారు.