వ్యాక్సిన్ చెడు ప్రభావం చూపుతుందేమో అన్న భయం, టీకా తర్వాత ఏ జ్వరమో ఇబ్బంది పెడుతుందన్న అనుమానం, అసలు టీకా అవసరమా? అన్న సంశయం .. ప్రజల్లో కొవిడ్ వ్యాక్సినేషన్‌పై భిన్నాభిప్రాయాలున్నాయి. కానీ, ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశంలోని గర్భిణులు కొవిడ్ టీకా విషయంలో స్థిర నిశ్చయంతో, పాజిటివ్ దృక్పథంతో ఉన్నారని హార్వర్డ్ విశ్వవిద్యాలయం జరిపిన సర్వేలో వెల్లడైంది. దీని ప్రకారం రష్యా, అమెరికా, ఆస్ట్రేలియా దేశాలలోని గర్భిణులతో పోలిస్తే భారత్, ఫిలిప్పీన్స్, లాటిన్ అమెరికాల్లోని గర్భిణులు కొవిడ్ టీకాకు మొగ్గు చూపుతున్నారు. పదహారు దేశాలలో దాదాపు 18 వేలమంది మహిళలను వ్యాక్సిన్ విషయమై అభిప్రాయం అడిగారు.
భారత్‌లోని గర్భిణుల్లో 60 శాతం, సాధారణ స్త్రీలలో 78 శాతానికి పైగానే సుముఖత వ్యక్తం చేశారు. అమెరికా, రష్యాల్లో మాత్రం 45 శాతం గర్భిణులే అంగీకారం తెలిపారు. అయితే, గర్భిణులకు టీకా వేయాలా, వద్దా అనే విషయంపై ‘ప్రపంచ ఆరోగ్య సంస’్థ పచ్చజెండా ఊపలేదు. టీకా తర్వాత ఉత్పన్నమయ్యే పరిస్థితులపై ఇంకా స్పష్టత రాలేదు. తమ ఆరోగ్యం, గర్భస్థ శిశువుల ఆరోగ్యంపై వ్యాక్సిన్ సానుకూల ప్రభావం చూపుతుందన్న ఆశతోనే కాబోయే అమ్మలు ఈ అభిప్రాయానికి వచ్చారు.