ఘట్కేసర్, జూలై 1: ఘట్కేసర్ పట్టణ కేంద్రంలోని రైల్వే బ్రిడ్జి నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ పట్టణ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన రిలే నిరహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. దీక్షకు సిద్ధమైన జేఏసీ కన్వీనర్ మారం లక్ష్మారెడ్డి, నాయకులు రేసు లక్ష్మారెడ్డి, సిరాజ్, నగేష్గుప్తా, ప్రమోద్ గుప్తా, కమలాకర్, ముల్గు రం జంగయ్యలను అదుపులోకి తీసుకుని మేడిపల్లి ఏసీపీ ముందు హాజరుపర్చా రు. బ్రిడ్జి విషయమై చర్చించేందుకు కలెక్టర్ సమక్షంలో సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో దీక్షను 2 రోజుల పాటు వాయిదా వేశారు.
అనంతరం నిర్మాణంలో ఉన్న వంతెన వద్ద ఆర్ అండ్ బీ ఈఈ రమేశ్‌తో స్థానిక ప్రజలు, యువత, వివిధ రాజకీయ పార్టీల నాయకులు బ్రిడ్జి విషయమై చర్చించేందుకు సమావేశమయ్యారు. ఈ సం దర్భంగా కాంగ్రెస్ నాయకులు ముల్లి జంగ య్య యాదవ్, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్ మధ్య తీవ్ర వాగ్వా దం చోటుచేసుకుంది. వంతెన పనుల నిధు లు, పనుల ఆలస్యంపై ఇరువురు పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ ఒకరినొకరు తీవ్ర పదజాలంతో దూషించుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితు లు నెలకొన్నాయి.
పోలీసులు, స్థానిక పెద్దలు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇదిలా ఉండ గా ఈఈ రమేశ్‌ను స్థానికులు చుట్టుముట్టి వంతెన నిర్మాణం పూర్తయ్యే గడువును ప్రకటించాలని డిమాండ్ చేశారు. పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేస్తామని ఈఈ హామీ ఇవ్వడంతో ప్రజలు శాంతించారు. దాదాపు 18 ఏళ్లుగా నిర్మాణంలో ఉన్న ఈ వంతెన కోసం నాలుగేళ్లుగా స్థానికులు, యువత, మహిళలు నిరంతరం ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఘట్కేసర్లో బ్రిడ్జి అంశం మరోసారి రాజకీయ వేడిని రాజేసి చర్చనీయాంశంగా మారింది.