సిటీబ్యూరో, జూలై 1 (నమస్తే తెలంగాణ): రుతుపవనాల ప్రభావంతో రాగల 48 గంట్లో గ్రేటర్లోని పలు తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వానలు కురిసే అవకాశమున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. కాగా నగరంలో బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 31.4 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 25.2 డిగ్రీలు, గాలిలో తేమ 64 శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.