Wait for donors | రాయికల్, జులై, 27 : ఓ నిరుపేద తండ్రి గుండెపోటుతో ఆదివారం ఉదయం మృతి చెందాడు. దీంతో అంత్యక్రియలు నిర్వహించాల్సిన కూతుర్లు తమ చేతిలో చిల్లి గవ్వలేక తల్లడిల్లుతున్నారు. దిక్కు తోచని స్థితిలో ఆర్థిక సాయం కోసం ధీనంగా వేడుకుంటున్న తీరు అందర్నీ కలిచివేస్తోంది. స్థానికుల కథనం ప్రకారం.. రాయికల్ పట్టణంలోని రోడ్డు పక్కన కొన్ని సంవత్సరాల నుండి ఓక గుడిసెలో నరాల జహంగిర్ (58) కమ్మరి పని నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు.
జహంగీర్ కు భార్య, ఇద్దరు కూతుర్లు ఒక కుమారుడు ఉండగా సంవత్సర క్రితం కుమారుడు ప్రమాదవసత్తు మృతి చెందాడు. ప్రస్తుతం భార్య అనారోగ్య బారిన పడింది. కాగా జహంగీర్ అనారోగ్యంతో మృతి చెందడంతో అతడి కుటుంబం దిక్కు తోచని స్థితిలో పడింది. తండ్రి మృతి చెందడం చేతిలో చిల్లి గవ్వ లేకపోవడంతో చనిపోయిన తండ్రి అంతక్రియలు ఎలో నిర్వహించాలో తెలియక తన తండ్రి అంతక్రియలకు తోచిన సహాయం చేయాలంటూ తన కూతుర్లు అక్కడున్న వారిని ప్రాధేయపడడం అందరినీ కలిసి వేసింది.
దీనికి తోడు రోజువారి పని చేసుకుంటే తప్ప తమ కుటుంబం నడవని పరిస్థితిల్లో ఉందని వాపోయారు. కుటుంబ పెద్ద మృతి చెందడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. జహంగీర్ కుటుంబానికి మనసున్న వారు ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.