సిరిసిల్ల : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) శుక్రవారం సిరిసిల్లా జిల్లాలోని పలు మండలాల్లో పర్యటించారు. గంభీరావుపేట మండలం లింగన్నపేటలో
ముత్యాల పోచమ్మ ( Mutyala Pochamma ) ఆలయానికి వచ్చిన సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఎల్లారెడ్డి పేట మండలంలోని నారాయణపూర్, రాగట్ల పల్లె లో పెద్దమ్మ ఆలయాన్ని దర్శించుకున్నారు. శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవంలో పాల్గొని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. దుమాలలోని శ్రీదేవి, భూ దేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్థిర ప్రతిష్ట మహోత్సవానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ త్వరగా వానలు కురవాలి. పంటలు బాగా పండాలి. పాడిపంటలు సమృద్ధిగా పండి రైతులు బాగుండాలి. గ్రామాలు బాగుంటేనే దేశం రాష్ట్రం బాగుంటుందని అన్నారు వీర్నపల్లి మండలం భావిసింగ్ భూక్యా తండాకు చేరుకున్న మాజీ మంత్రి కేటీఆర్ జగదాంబ మాత సేవ లాల్ మహరాజ్ విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్నారు.