Chinese Ministers: చైనాలో ఇద్దరు మాజీ రక్షణ మంత్రులకు మరణశిక్ష
Chinese Ministers: చైనా రక్షణ మంత్రులుగా చేసిన ఇద్దరికీ భారీ శిక్ష వేసింది కోర్టు. గతంలో రక్షణ మంత్రులుగా చేసిన వి ఫెంగీ, లీ షాంగ్పు.. మరణశిక్ష విధించింది. అయితే రెండేళ్ల సమయంలో ఎటువంటి అపరాధానికి పాల్పడకుంటే, వారికి జీవితకాల శిక్ష వర్తించనున్నది.
బీజింగ్: చైనా రక్షణ మంత్రులు(Chinese Defence Ministers )గా చేసిన ఇద్దరికీ భారీ శిక్ష వేసింది కోర్టు. గతంలో రక్షణ మంత్రులుగా చేసిన వి ఫెంగీ, లీ షాంగ్పు.. మరణశిక్ష విధించింది. అయితే రెండేళ్ల సమయంలో ఎటువంటి అపరాధానికి పాల్పడకుంటే, వారికి జీవితకాల శిక్ష వర్తించనున్నది. అవినీతి కేసులో మిలిటరీ కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది. ఇద్దరు మంత్రులు గతంలో లంచాలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. లీ షాంగ్పూ లంచాలు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ 2014 నుంచి అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. సీనియర్ మిలిటరీ, పొలిటికల్ అఫీషియల్స్ను ఆయన టార్గెట్ చేస్తున్నారు. ఆ ఆపరేషన్లో భాగంగా అనేక మంది హై ర్యాంక్ ఆఫీసర్లు, మిలిటరీ నేతల్ని కోల్పోవాల్సి వచ్చింది. ఈ ఏడాది జనవరిలో చైనా మిలిటరీ నాయకత్వంలో భారీ మార్పులు జరిగాయి. గతంలో 11 మంది సభ్యులతో శక్తివంతంగా ఉన్న సెంట్రల్ మిలిటరీ కమీషన్లో ఇప్పుడు సంఖ్య తగ్గినట్లు తెలుస్తోంది. అవినీతి వ్యతిరేక ప్రచారంతో జిన్పింగ్ ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం పెరిగింది. అయితే దేశాధ్యక్షుడు జిన్పింగ్తో లీ షాంగ్పూ , వి ఫెంగీ మధ్య ఏవైనా బేధాలు ఉన్నాయో లేదో తెలియదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

