బిజినేపల్లి : రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లోని అమ్ముకోవాలని, దళారులను ( Middlemen) నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ( MLA Rajesh Reddy ) అన్నారు. గురువారం బిజినపల్లి మండలం ఖానాపూర్ గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సకాలంలో ధాన్యం కొంటున్నామని తెలిపారు. సన్నరకం వడ్లకు క్వింటాకు రూ. 500 బోనస్ ఇచ్చి ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తోందన్నారు. రైతులు ప్రభుత్వ కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని అన్నారు.
రైతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు. వ్యవసాయానికి పెద్ద పీట వేసి రైతులకు రుణమాఫీ, రైతుబంధును ప్రభుత్వం ఇస్తుందని గుర్తు చేశారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ బాలరాజ్ గౌడ్, వ్యవసాయాధికారి నీతి, రవి, రాములు,బంగారయ్య, తిరుపతయ్య, రామన్ గౌడ్, వెంకట్ స్వామి, నజీర్, నగేష్ తదితరులు పాల్గొన్నారు.