బిజినేపల్లి : యాసంగిలో రైతుల పండించిన ధాన్యం ( Grains ) కొనుగోలు విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు వ్యవహరించాలని ఎంపీ మల్లురవి ( MP Mallu Ravi ) అన్నారు. శనివారం మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయాన్ని ఆయన సందర్శించి ఐకేపీ, సింగిల్ విండో కార్యాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటుచేసిన కేంద్రాల వద్ద రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకోవాలని సూచించారు. సన్నరకం వడ్లకు క్వింటాకు రూ. 500 బోనస్ ప్రభుత్వం ఇస్తుందన్నారు. సంబంధిత శాఖ సిబ్బంది కేంద్రాల్లో రైతులకు అందుబాటులో ఉండి పనిచేయాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీరాములు, విష్ణువర్ధన్ రెడ్డి, తిరుపతయ్య, ముక్తార్, రాములు, ఈశ్వర్, రాము, పాషా, మాన్య నాయక్, సూరి, శ్రీనివాస్ గౌడ్, తదితరులు ఉన్నారు.