వనపర్తి టౌన్, ఏప్రిల్ 10 : గొల్లపల్లి , చీర్కపల్లి రిజర్వాయర్ ప్రతిపాదనకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమం పోరాట స్ఫూర్తికి నిదర్శనమని, మాజీ మంత్రి హరీశ్‌రావు పర్యటన రైతుల్లో మనోనిబ్బరం నింపాయ ని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ అన్నారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల స మావేశంలో గొల్లపల్లి మాజీ మంత్రి హరీశ్‌రావు సభ విజయవంతం కావడంపై వారు మాట్లాడారు.
మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి నాయకత్వంలో రైతుల కోసం రెండు చారిత్రాత్మకమైన సభలు విజయవంతమయ్యాయని ఈ రెండు సభల్లో పాల్గొని బీఆర్ఎస్ శ్రేణుల్లో పోరాటస్ఫూర్తి నింపిన మాజీ మంత్రి హరీశ్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. హరీశ్‌రావు సభకు ఊహించని రీతిలో స్వచ్ఛందంగా పదివేల మందికి పైగా తరలివచ్చిన రైతులు, ప్రజలకు వారు కృతజ్ఞతలు, అభినందనలు చెప్పారు.
గొల్లపల్లి సభ విజయవంతం చేయడానికి కృషిచేసిన మాజీ మంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ సహకరించిన మాజీ మం త్రులు శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, ఎమ్మెల్యే విజేయుడు, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అంజయ్యయాదవ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ ప్రజాప్రతినిధులు, సర్పంచులు, కౌన్సిలర్లు, ప్రిం ట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, పోలీస్ అధికారులకు వారు ధన్యవాదాలు తెలిపారు.
సమావేశంలో వెంకట్‌సాగర్, నీలస్వామి, సూర్యవంశం గిరి, మహేశ్వర్‌రెడ్డి, ముద్దుసార్, అలీమ్ తదితరులు ఉన్నారు.