
రంగారెడ్డి, డిసెంబర్ 31, (నమస్తే తెలంగాణ): పంట పెట్టుబడి కోసం అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ అవుతుండటంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సంబురాలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు రైతులు, నాయకులు క్షీరాభిషేకాలు నిర్వహించి కృతజ్ఞతలు తెలుపుతున్నా రు. రంగారెడ్డి జిల్లాలో నాలుగో రోజు శుక్రవారం అధికారులు రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయాన్ని జమ చేశారు. తొలిరోజు ఎకరంలోపు ఉన్న రైతులకు రైతుబంధు డబ్బులను జమ చేయగా, రెండోరోజు రెండు ఎకరాల్లోపు రైతు లకు, మూడోరోజు మూడు ఎకరాల్లోపు రైతులకు, నాలుగో రోజు శుక్రవారం నాలుగు ఎకరాల్లోపు ఉన్న రైతులకు ప్రభు త్వ సాయాన్ని ఎకరానికి రూ.5 వేల చొప్పున జమ చేశారు. మొదటి రోజు 96,142 మంది రైతులకు రూ.28.04 కోట్ల రైతుబంధు సాయాన్ని, రెండోరోజు 79,083 మంది రైతులకు రూ.56.71 కోట్లు, మూడోరోజు 43,047 మంది రైతులకు రూ. 53.12కోట్లు, నాలుగోరోజు 26,975 మంది రైతులకు రూ.44.70 కోట్ల ఆర్థిక సాయాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. అయితే జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 2,45,247 మంది రైతులకు రూ.182.58 కోట్ల పెట్టు బడి సాయాన్ని ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది.
వికారాబాద్ జిల్లాలో రూ.46.28 కోట్లు
పరిగి, డిసెంబర్ 31: వికారాబాద్ జిల్లాలో శుక్రవారం నాల్గోరోజు నాలుగు ఎకరాల్లోపు భూమి ఉన్న 27,272 మంది రైతులకు రూ.46,28,59,197కోట్ల పెట్టుబడి సా యాన్ని ప్రభుత్వం వారి ఖాతాల్లో జమ చేసింది. జిల్లాలో యాసంగి సీజన్లో మొత్తం 2,57,148 మంది రైతులకు రూ.3,18,21,80,050 ప్రభుత్వం మంజూరు చేసింది. జిల్లాలో మొదటి రోజు ఎకరం లోపు భూమి ఉన్న 53,772 మంది రైతులకు రూ.17,80,57,562, 29వ తేదీన రెండు ఎకరాల భూమి గల 70,824 మంది రైతులకు రూ.51, 85,66,894, 30వ తేదీన మూడు ఎకరాలు భూమి గల 42,362 మంది రైతులకు రూ.53,32,29,266 వారి బ్యాంకు ఖాతాల్లో అధికారులు ప్రభుత్వ సాయాన్ని జమ చేశారు. నాలుగు రోజుల్లో జిల్లాలోని 1,94,810 మంది రైతులకు రూ.169,60,37,879 ప్రభుత్వ సాయం అం దింది. 31వ తేదీ శుక్రవారం జిల్లాలోని బొంరాస్‌పేట మం డలంలో 1,845 మంది రైతులకు రూ.3,09,78,337, దౌల్తాబాద్‌లో 2,242 మందికి రూ.3,82,86,449, కొడంగల్‌లో 2,054 మందికి రూ.3,47,38,088, చౌడాపూర్‌లో 698 మందికి రూ.1,17,04,346, దోమలో 1,362 మందికి రూ.2,36,49,264, కులకచర్లలో 1,071 మందికి రూ.1,81,81,373, పరిగిలో 1,639 మందికి రూ.2,78, 81,403, పూడూరులో 1,459 మందికి రూ.2,36,68, 963, బషీరాబాద్‌లో 1,515 మందికి రూ.2,62,98, 782, పెద్దేముల్లో 1,530 మందికి రూ.2,65,67,112, తాండూరులో 1,324 మందికి రూ.2,33,97,703, యా లాల్లో 1,324 మందికి రూ.2,26,74,363, బంట్వారం లో 799 మందికి రూ.1,35,04,625, ధారూర్‌లో 1,406 మందికి రూ.2,29,92,312, కోట్‌పల్లిలో 932 మందికి రూ.1,58,63,062, మర్పల్లిలో 1,725 మందికి రూ.2, 92,14,561, మోమిన్‌పేట్‌లో 1,281 మందికి రూ.2,18, 94,148, నవాబుపేట్‌లో 1,536 మందికి రూ.2,55,84, 822, వికారాబాద్‌లో 1,531 మందికి రూ.2,57,79, 484 రైతుల బ్యాంకు ఖాతాలలో జమ చేయబడ్డాయి.