రైతులను దోపిడీ చేస్తే ఊరుకోం
దళారులు, వ్యాపారుల చేతిలో రైతులు దోపిడీకి గురవుతున్నారని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆందోళన వ్యక్తంచేశారు. మంగళవారం సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రంలో పర్యటించిన ఆయన.. ధాన్యం కొనుగోలు కేంద్రాలు, రైతుల పంట పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెట్టుబడి సాయం, సాగునీరు, విద్యుత్తు సరఫరా వంటి అంశాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
- తూకం, తాలు పేరుతో బస్తాకు 2.5 కిలోల కోతనా?
- క్వింటాపై ధర వెయ్యి తగ్గింపా?
- కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం
చిలుకూరు, నవంబర్ 10 : దళారులు, వ్యాపారుల చేతిలో రైతులు దోపిడీకి గురవుతున్నారని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆందోళన వ్యక్తంచేశారు. మంగళవారం సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రంలో పర్యటించిన ఆయన.. ధాన్యం కొనుగోలు కేంద్రాలు, రైతుల పంట పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెట్టుబడి సాయం, సాగునీరు, విద్యుత్తు సరఫరా వంటి అంశాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
ఎల్ నివో ప్రభావంతో వర్షాలు తక్కువగా పడినా ప్రభుత్వాన్ని నమ్ముకుని రైతులు వరి సాగు చేశారని పేర్కొన్నారు. రైతుబంధు అందక, యూరియా కొరత, సాగునీటి సమస్యలతో రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. తడిసిన ధాన్యాన్ని సాకుగా చూపుతూ రైతుల నుంచి తాలు పేరిట బస్తాకు 2.5 కిలోల వరకు కోత విధిస్తున్నారని మండిపడ్డారు. గతంలో క్వింటా ధాన్యానికి రూ.4,200 వరకు ధర పలుకగా ప్రస్తుతం రూ.3,200కు తగ్గించారని, దీంతో రైతులు క్వింటాకు వెయ్యి నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

