కాటారం, అక్టోబర్ 26 : చిన్న కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ఆదివారంపేట ఎర్రచెరువును రిజర్వాయర్‌గా మార్చి చేపట్టిన మత్తడి పనులను ఆదివారం రైతులు, భూనిర్వాసితులు అడ్డుకున్నారు.
మత్తడి నిర్మాణం కోసం ఎక్స్‌కవేటర్‌తో కట్ట తవ్వకం పనులు చేపట్టగా తమకు పరిహారం ఇచ్చేవరకు పనులు చేయొద్దని నిరసన తెలిపారు. చెరువు విస్తరణ కోసం శిఖంలో ముంపునకు గురయ్యే భూములను 14 ఏళ్ల క్రితం తీసుకోగా కొందరికి నేటికీ పరిహారం అందలేదని వారు ఆవేదన వ్యక్తంచేశారు.