Veterinary Officer Transfer | వేలేరు: పశువుల ఆరోగ్యం నుంచి రైతుల ఆర్థిక భరోసా కోసం అండగా నిలిచిన పశు వైద్యాధికారి బదిలీ కావడంతో రైతులు భావోద్వేగానికి గురయ్యారు. 14 సంవత్సరాలు సేవలందించిన వెటర్నరీ డాక్టర్ రణధీర్ రెడ్డికి వీడ్కోలు పలుకుతూ కన్నీటిపర్యంతమయ్యారు.
వేలేరు మండల కేంద్రంలో డాక్టర్ రణధీర్ రెడ్డి 14 ఏళ్లు పశువైద్యాధికారిగా సేవలందించారు. ఇటీవల ఆయనకు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలానికి బదిలీ అయ్యింది. ఈ క్రమంలో సోమవారం ఉదయం ఆయనకు మండల రైతులు ఘనంగా వీడ్కోలు పలికారు. శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా రైతులు భావోద్వేగానికి గురయ్యారు.
గత 14 ఏళ్లుగా వేలేరు మండల రైతులతో డాక్టర్ రణధీర్ రెడ్డికి అవినాభావ సంబంధం ఏర్పడిందని ఈ సందర్భంగా రైతులు తెలిపారు. గత 14 ఏళ్లలో ఎల్లప్పుడూ రైతులకు అందుబాటులో ఉండేవారని తెలిపారు. ఇప్పుడు ఆయన సేవలను కోల్పోతుండటం బాధాకరమని భావోద్వేగానికి గురయ్యారు.