Jupitar Transit | 12 ఏండ్ల తర్వాత కర్కాటకంలోకి గురుగ్రహ సంచారం.. ఏ రాశి వారికి అదృష్టం? ఎవరు జాగ్రత్తగా ఉండాలి?
Jupitar Transit | వేద జ్యోతిష్య శాస్త్రంలో గురుగ్రహాన్ని శుభప్రదంగా పరిగణిస్తారు. ధనం, విద్య, వివాహం, సంతాన కారకుడిగా భావించే గురుడు జూన్ 2వ తేదీ రాత్రి 1.50 గంటలకు తన ఉచ్చరాశి అయిన కర్కాటకంలోకి ప్రవేశించనున్నారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత గురుడు ఉచ్చరాశిలోకి వస్తుండటం జ్యోతిష్యపరంగా అత్యంత శుభసూచకంగా భావిస్తున్నారు.
Jupitar Transit | వేద జ్యోతిష్య శాస్త్రంలో గురుగ్రహాన్ని శుభప్రదంగా పరిగణిస్తారు. ధనం, విద్య, వివాహం, సంతాన కారకుడిగా భావించే గురుడు జూన్ 2వ తేదీ రాత్రి 1.50 గంటలకు తన ఉచ్చరాశి అయిన కర్కాటకంలోకి ప్రవేశించనున్నారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత గురుడు ఉచ్చరాశిలోకి వస్తుండటం జ్యోతిష్యపరంగా అత్యంత శుభసూచకంగా భావిస్తున్నారు.
కర్కాటకం చంద్రుని రాశి కావడంతో ఈ గ్రహ సంచారం అనేది మనశ్శాంతి, కుటుంబ బాధ్యతలు, భావోద్వేగ స్థిరత్వం, ఆధ్యాత్మిక ఆలోచనలపై ప్రభావం చూపనుంది. కొన్ని రాశుల వారికి ధనలాభాలు, ఉద్యోగ పురోగతి ఉండగా.. మరికొన్ని రాశుల వారు మాత్రం ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని జ్యోతిష్యులు సూచిస్తున్నారు.
మేషం
గురుగ్రహం చతుర్థ స్థానంలో సంచరించడంతో కుటుంబంలో సుఖసంతోషాలు పెరుగుతాయి. ఇల్లు కొనుగోలు, స్థిరాస్తి పెట్టుబడులపై ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగం చేసే చోట గౌరవం పెరిగే సూచనలు ఉన్నాయి. విదేశీ ప్రయాణ యోగం ఉంది.
పరిహారం: గురువారం శ్రీమహావిష్ణువుకు పసుపు పూలు సమర్పించాలి.
వృషభం
ఈ రాశివారికి తృతీయ స్థానంలో గురుగ్రహ సంచారం ఉండటం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మాట్లాడే తీరు ఆకర్షణీయంగా మారి ఇతరులను ఆకట్టుకుంటుంది. తోబుట్టువుల సహకారం లభిస్తుంది. దాంపత్య జీవితం, భాగస్వామ్య వ్యాపారాల్లో మెరుగుదల కనిపిస్తుంది. ఆదాయ అవకాశాలు పెరిగే సూచనలు ఉన్నాయి.
పరిహారం: గురువారం శనగపప్పు దానం చేయడం శుభప్రదం.
మిథునం
ద్వితీయ స్థానంలో గురుగ్రహ సంచారం ఆర్థిక వ్యవహారాలపై ప్రభావం చూపుతుంది. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకునే అవకాశం ఉంది. ఉద్యోగంలో పరుగోతి ఉంటుంది. శత్రువులపై పైచేయి సాధించే సూచనలు ఉన్నాయి. పనుల్లో ఎదురయ్యే సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటారు.
పరిహారం: గురువారం గురు బీజ మంత్రాన్ని జపించడం మంచిది.
కర్కాటకం
గురుడు స్వయంగా కర్కాటక రాశిలోకి రావడంతో అత్యంత శుభప్రదమైన కాలంగా భావిస్తున్నారు. వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసరం పెరుగుతుంది. విద్య, సంతానం, పెట్టుబడులు, వివాహ సంబంధ విషయాల్లో మంచి ఫలితాలు కనిపిస్తాయి. అదృష్టం కలిసి వచ్చే సమయం ఇది.
పరిహారం: గురువారం విష్ణుమూర్తిని ఆరాధించాలి. అవసరమైన వారికి సహాయం చేయాలి.
సింహం
ద్వాదశ స్థానంలో గురు గ్రహ సంచారం కారణంగా ఆధ్యాత్మికత వైపు ఆసక్తి పెరుగుతుంది. విదేశీ సంబంధిత పనుల్లో అవకాశాలు రావచ్చు. ఆరోగ్య విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం. ఇంట్లో ప్రశాంతత పెరుగుతుంది. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. రహస్య విషయాలు, ఆధ్యాత్మిక జ్ఞానంపై ఆసక్తి పెరుగుతుంది.
పరిహారం: గురువారం పసుపు లేదా పసుపు రంగు స్వీట్లు దానం చేయడం శుభప్రదం
కన్య
గురుడు ఏకాదశ స్థానంలో ఉండటం వల్ల చాలాకాలంగా ఎదురుచూస్తున్న కోరికలు నెరవేరే సూచనలు ఉన్నాయి. ఆదాయ వనరులు పెరుగుతాయి. విద్య, సంతానం, వ్యాపార భాగస్వామ్యాల్లో శుభఫలితాలు కనిపిస్తాయి. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి.
పరిహారం: గురువారం నాడు గురుగ్రహ ప్రార్థనలు చేయాలి.
తుల
దశమ స్థానంలో గురుగ్రహ సంచారం కారణంగా ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పురోగతి కనిపిస్తుంది. పదోన్నతి అవకాశాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవతుంది. కుటుంబంలో సౌఖ్యం పెరుగుతుంది. పోటీ పరిస్థితుల్లో విజయాన్ని అందుకునే శక్తి పెరుగుతుంది.
పరిహారం: గురువారం ఆవుకు పచ్చి మేత వేయడం మంచిది.
వృశ్చికం
నవమ స్థానంలో గురుగ్రహ సంచారం అదృష్టాన్ని పెంచుతుంది. ఉన్నత విద్య, విదేశీ అవకాశాలు, ఆధ్యాత్మిక విషయాల్లో పురోగతి ఉంటుంది. వ్యక్తిత్వం ప్రభావవంతంగా మారి సమాజంలో గౌరవం పెరుగుతుంది. సంతానం, విద్యకు సంబంధించిన విషయాల్లో శుభఫలితాలు కనిపిస్తాయి.
పరిహారం: గురువారం పసుపు దానం చేయడం లేదా పసుపు రంగు దానం చేయడం శుభప్రదం.
ధనుస్సు
అష్టమ స్థానంలో గురుగ్రహ సంచారం జీవితంపై లోతైన ఆలోచనలు, ఆత్మపరిశీలన వైపు మళ్లిస్తుంది. పరిశోధన, చికిత్స, ఆధ్యాత్మిక అంశాల్లో ఆసక్తి పెరుగుతుంది. పొదుపు, ఆర్థిక భద్రతపై దృష్టి పెడతారు. మానసిక ప్రశాంతత లభించే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణాలు, ఆధ్యాత్మిక యాత్రలపై ఆసక్తి పెరిగే సూచనలున్నాయి.
పరిహారం: ఓం గురవే నమః మంత్రాన్ని జపించాలి.
మకరం
సప్తమ స్థానంలో గురుగ్రహ సంచారం దాంపత్య జీవితం, వ్యాపార భాగస్వామ్యాలకు అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో అవగాహన పెరుగుతుంది. ఆర్థిక లాభాలు, సామాజిక గౌరవం పెరిగే అవకాశం ఉంది. కొత్త పనులు ప్రారంభించే అవకావం ఉంది. ప్రయాణాలపై ఆసక్తి పెరుగుతుంది.
పరిహారం: గురువారం పసుపు రంగు పండ్లను దానం చేయడం మంచిది.
కుంభం
షష్ట స్థానంలో గురుగ్రహ సంచారంతో సమస్యలను తెలివిగా ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది. ఉద్యోగ బాధ్యతలు పెరిగినా భవిష్యత్తుకు బలమైన పునాది పడుతుంది. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది.
పరిహారం: గురువారం ఆలయంలో శనగపప్పు సమర్పించడం శుభప్రదం.
మీనం
పంచమ స్థానంలో గురుగ్రహ సంచారం అత్యంత అనుకూలంగా ఉంటుంది. విద్య, సంతానం, సృజనాత్మకత, పెట్టుబడలు విషయంలో మంచి ఫలితాలు కనిపిస్తాయి. అదృష్టం కలిసి రావడంతో ఆధ్యాత్మిక పురోగతి కూడా ఉంటుంది. అదృష్టం కలిసి వచ్చి ఎన్నో రోజులుగా ఉన్న కోరికలు నెరవేరే అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
పరిహారం: శ్రీమహావిష్ణువును ఆరాధించడం శుభఫలితాలు ఇస్తుంది.
Read Today's Latest Horoscope News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harsha | నెట్‌ఫ్లిక్స్‌లో హర్ష వెబ్‌సిరీస్ జోరు.. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
Journalist Richa: కిందపడేలా రాహుల్ గాంధీ తోశాడు.. ప్రెగ్నెంట్ జర్నలిస్టు ఆరోపణ
Imran Khan | ముంబై నిరసనలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ మేనల్లుడు.. దేశం నుంచి బహిష్కరించాలన్న బీజేపీ నేత
Delhi Police | కేంద్ర బలగాలను ఈ నెల 20 వరకు ఉపసంహరించొద్దు.. హోంశాఖకు ఢిల్లీ పోలీసుల లేఖ
Sobhita Dhulipala | పెళ్లి తర్వాత శోభిత ధూళిపాళ బోల్డ్ ఫోటోషూట్.. షాక్‌లో అక్కినేని అభిమానులు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

