హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ) : సర్కార్ ఆడుతున్న అధికారుల బదిలీల ఆటలో రైతులు బలిపశువులుగా మారుతున్నారు. పద్ధతి, ప్రణాళిక, ముందుచూపు లేకుండా ప్రభుత్వ పెద్దలు తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న విధానాలు అన్నదాతలకు పెనుశాపంగా మారాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పంటల కొనుగోళ్ల సమయంలో ఐఏఎస్‌లతో పాటు ఇతర అధికారులను పదే పదే బదిలీ చేయడంతో తీవ్ర ప్రభావం పడుతున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సరిగ్గా పంటల కొనుగోళ్లకు ముందు ప్రభుత్వం ఐఏఎస్‌లను బదిలీ చేసింది. ఆ తర్వాత కొనుగోళ్లు జోరందుకున్న సమయంలో మరోసారి అధికారులను బదిలీ చేసింది. కొనుగోళ్ల ఏర్పాట్లు, పర్యవేక్షణను ఆగం చేసి, రైతులను దెబ్బతీసిందని మండిపడుతున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను అర్థం చేసుకోకుండా తీసుకుంటున్న నిర్ణయాలు ధాన్యం, మక్కజొన్న, జొన్న తదితర పంటల కొనుగోళ్లను జటిలం చేశాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లోని హెడ్ ఆఫీసుల్లో కూర్చొని ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా, క్షేత్రస్థాయిలో పంటల కొనుగోలు ఏర్పా ట్లు, పర్యవేక్షణ బాధ్యత జిల్లాల కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లపైనే ఉంటుంది.
కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం, ట్రా న్స్పోర్ట్ అధికారులను కేటాయించడం అన్నీ కలెక్టర్ల చేతుల్లోనే ఉంటాయి. ఇంతటి ప్రధా న పాత్ర పోషించే కలెక్టర్లను, అడిషనల్ కలెక్టర్లను ప్రభుత్వం పంటల కొనుగోళ్లకు ముందు ఒకసారి ఫిబ్రవరి 26న బది లీ చే సింది. 45 మంది ఐఏఎస్‌లను బదిలీ చేయగా, ఇందులో 11 మంది కలెక్టర్లు, 10 మంది అడిషనల్ కలెక్టర్లు ఉన్నారు. దీంతో కొనుగోళ్ల ఏర్పాట్లపై ప్రభావం పడిందని చె ప్తున్నారు. ఏప్రిల్ మొదటివారంలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమ య్యాయి. అంటే బదిలీ అయిన కలెక్టర్లకు ఏర్పాట్లకు కేవలం నెల రోజుల సమయం మాత్రమే లభించింది. ఈ నెల రోజుల్లో కొ త్త వాతావరణాన్ని అర్థం చేసుకునేదెప్పు డు, అధికారులతో సమన్వయం చేసేదెప్పు డు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆ తర్వాత పంటల కొనుగోళ్లు జోరుమీదున్న సమయంలో ఉన్నపళంగా ఏప్రిల్ 25న మరోసారి కలెక్టర్లను, అడిషనల్ కలెక్టర్లను బదిలీ చేసింది. ఈసారి 30 మంది ఐఏఎస్‌లను బదిలీ చేసింది. ఇందులో ఎనిమిది మంది కలెక్టర్లు, మరికొంతమంది అడిషనల్ కలెక్టర్లు ఉన్నారు. దీంతో కొనుగోళ్లపై ప్రభావం పడింది. అధికారులు జిల్లాపై, పనులపై పట్టు సాధించే సమయంలో ప్రభుత్వం బదిలీలు చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ధాన్యం రైతులతో పోల్చితే మక్కజొన్న, జొన్న రైతుల కష్టాలు మరింత ఎక్కువగా ఉన్నాయి. మక్కజొన్న కొనుగోళ్లలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రైతులు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నారు. గన్నీ సంచులు లేవు, గోదాములు లేవు, రవాణా లేదు. ఇప్పటికే గన్నీలు సరఫరా చేయలేక కాంట్రాక్టర్లు దాదాపుగా చేతులెత్తేశారు. రవాణా కాంట్రాక్టర్లు సైతం వారి దారిలోనే నడుస్తున్నారు. కొనుగోలు చేసిన మక్కలను నిల్వ ఉంచేందుకు ఎవరూ గోదాములు ఇచ్చే పరిస్థితి లేదు. ఒకవిధంగా చెప్పాలంటే మక్కలు, జొన్నల కొనుగోళ్ల ప్రక్రియ సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నది. ఇలాంటి అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం రాత్రికి రాత్రి మార్క్‌ఫెడ్ ఎండీని బదిలీ చేసింది.
ఏదో ఉపద్రవం ముంచుకొచ్చినట్టుగా శనివారం రాత్రి 10 గంటలకు బదిలీ ఉత్తర్వులు జారీ చేసింది. ఎండీ శ్రీనివాస్‌రెడ్డిని బదిలీ చేస్తూ ఆ స్థానంలో కోఆపరేటివ్ కమిషనర్ రాహుల్‌రాజ్‌ను నియమించింది. అది కూడా పూర్తిస్థాయి కాకుండా ఎఫ్ఏసీ బాధ్యతలు అప్పగించింది. పోనీ ఆయనైనా విధుల్లో చేరా రా అంటే అదీలేదు. చార్జి తీసుకున్న అనంతరం ఆయన సెలవుల్లో వెళ్లారు. ఈ నెల 16న తిరిగి రానున్నట్టు తెలిసింది. ఓవైపు క్షేత్రస్థాయిలో మక్కజొన్న కొనుగోళ్లలో తీ వ్ర సమస్యలు నెలకొంటే ఇలాంటి పరిస్థితుల్లో ఎండీని బదిలీ చేయడంపై తీవ్ర వి మర్శలు వ్యక్తమవుతున్నాయి. కొత్తగా వ చ్చే అధికారికి సబ్జెక్టు ఎప్పుడు అర్థం కావా లి..? ఉద్యోగులతో పరిచయం ఎప్పుడు పెరగాలి? ఏం చేస్తే, ఏ విధంగా చేస్తే బా గుంటుందనే అంశం ఎప్పుడు బోధపడాలనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉం టే ప్రస్తుతం మార్క్‌ఫెడ్ హెడ్ ఆఫీసులో కీలక విభాగాలైన ప్రొక్యూర్మెంట్, ఫర్టిలైజర్, అకౌంట్స్ విభాగానికి మేనేజర్లుగా అంతా కొత్తవారే కావడం గమనార్హం. నెలరోజుల క్రితం చేసిన అధికారుల అంతర్గత బదిలీలు సైతం మక్కల కొనుగోళ్లపై ప్రభావం చూపించాయని అంటున్నారు.
కీలకమైన కొనుగోళ్ల సమయంలో కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, ఇతర అధికారుల బదిలీలు కొనుగోళ్లను తీవ్ర సమస్యగా మార్చాయని అంటున్నారు. కొత్తగా బదిలీపై వచ్చిన అధికారులు సర్దుకోకముందే మరోసారి బదిలీ చేయడంతో ఇబ్బందులు తలెత్తాయని చెప్తున్నారు. బదిలీలతో జిల్లాలు మారిన అధికారులు అక్కడి పరిస్థితులను అంత వేగంగా అర్థం చేసుకోలేకపోయారని, నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని, దీంతో కొనుగోళ్లలో సమస్యలు ఏర్పడ్డాయని అభిప్రాయపడుతున్నారు. బదిలీల సమయంలో ఏర్పడిన మూడు నాలుగు రోజుల గ్యాప్‌లో అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయని, ఆ సమస్యలు అలాగే కొనసాగుతున్నాయని అక్కడి అధికారులు చెప్తున్నారు. అందుకే కొనుగోళ్ల ప్రక్రియ ఆగమాగమైందని అంటున్నారు.