
కందుకూరు/మహేశ్వరం, జనవరి 10: సీఎం కేసీఆర్ రైతు బాంధవుడని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రైతులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని చూసి ఓర్వలేకనే బీజేపీ, కాంగ్రెస్ నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆమె విమర్శించారు. రైతుబంధు సంబురాల్లో భాగంగా సోమవారం మహేశ్వరం, కందుకూరు మండలాల్లో ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సబితారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీఆర్ఎస్ను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం ఏ ఒక్కరికీ లేదని అన్నారు.