గన్నేరువరం, ఆగస్టు 6 : బ్యాంకులో డబ్బులు డ్రా చేస్తూ గుండెపోటుతో రైతు మృతిచెందిన ఘటన కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లిలో చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. జంగపల్లికి చెందిన రైతు హనుమండ్ల బాలయ్య (55) వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. డబ్బులు అవసరం కావడంతో గురువారం మధ్యాహ్నం గుండ్లపల్లి ఎక్స్‌రోడ్‌లోని ఎస్బీఐకి వెళ్లాడు.
డబ్బులు డ్రా చేసుకునేందుకు లైన్లో నిల్చోగా ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలాడు. స్థానికులు గమనించి దవాఖానకు తరలించేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే మృతిచెందాడు. కండ్ల ముందే రైతు కుప్పకూలి మృతి చెందడంతో బ్యాంకు సిబ్బంది, ఖాతాదారులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ఘటనతో జంగపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య కనకవ్వ ఉన్నది, పిల్లలు లేరు.