పెగడపల్లి, జూన్ 14 : వరినారు పోసేందుకు గడిని తొలగిస్తూ పొలం వద్దనే ఓ రైతు గుండెపోటుతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రానికి చెందిన ఊట్కూరి శంకరయ్య (52) వ్యవసాయ పనుల కోసం ఆదివారం ఉదయం పొలానికి వెళ్లాడు.
వరి నారు పోసేందుకు గడ్డిని తొలగిస్తుండగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. శంకరయ్యకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరారు.